AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేవైఎం నేత దారుణహత్య

ధారవాడ జిల్లా భారతీయ జనతా యువమోర్చా ఉపాధ్యక్షుడు, గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షుడు ప్రవీణ్‌ కమ్మార్‌ (36) దారుణహత్యకు గురయ్యారు. ధారవాడ తాలూకా కోటూరు గ్రామంలో మంగళవారం రాత్రి వ్యక్తిగత కారణాలతో యువకుల మధ్య గొడవ తలెత్తింది. ఈ సందర్భంగా ప్రవీణ్‌ను చాకుతో పొడిచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ ప్రవీణ్‌ను ఎస్‌డీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స ఫలించక మృతి చెందాడు. ఘటనకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఎస్పీ బీ లోకేశ్‌(%ూూ దీ ూశీసవంష్ట్ర%) వెల్లడిరచారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో ఉడచమ్మ దేవి జాతర సందర్భంగా కొందరు ఘర్షణ పడుతుండగా నచ్చ చెప్పేందుకు వెళ్లిన ప్రవీణ్‌పై దాడికి పాల్పడ్డారన్నారు. సమాచారం అందుకున్న కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి(%వీఱఅఱర్‌వతీ ూతీaష్ట్రశ్రీaస జీశీంష్ట్రఱ%) ఆసుపత్రికి వెళ్లి ఘటన వివరాలను ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది రాజకీయ కుట్ర అని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమృత్‌దేశాయ్‌ తదితరులు ఉన్నారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసు బలగాలను రంగంలోకి దించారు. దీనిపై బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వి సూర్య స్పందిస్తూ ప్రవీణ్‌ ఆత్మకు శాంతి లభించాలని కోరుతూ ట్వీట్‌ చేశారు.

ANN TOP 10