AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వాళ్ల మీద పీడీ యాక్ట్‌ ఎందుకు పెడ్తలేరు?: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీ మీద సీఎం కేసీఆర్‌ వేసిన సిట్‌ నిజంగానే కూలబడిరదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు. ఇప్పటి వరకు 18 మంది నిందితులను అరెస్టు చేసి వాళ్లను పువ్వుల్లో పెట్టి కాపాడుకుంటున్నరని ఆయన ఆరోపించారు. వీళ్లను వేరే పేపర్ల కొనుగోలు మీద, వేరు వేరు ప్రదేశాల్లో, సమయాల్లో అరెస్టు చేసినపుడు వీళ్ల మీద ఇంకా కొత్త కేసులు పెట్టాలి కదా? అని ప్రశ్నించారు. వీళ్లలో ముఖ్యుల మీద పీడీ యాక్ట్‌ ఇంకా ఎందుకు పెడ్తలేరు? అని ప్రవీణ్‌ కుమార్‌ నిలదీశారు. ప్రజలకు నిజాలను ప్రెస్‌ మీట్‌ పెట్టి ఎప్పుడు చెప్తరు? అన్న ఆయన.. సీఎం ఎందుకు ముఖం చాటేస్తున్నారు? అని ట్వ్టీ లో పేర్కొన్నారు.

ANN TOP 10