టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 2019 ఎన్నికల్లో పాలిచ్చే ఆవుని కాకుండా.. తన్నే దున్నని తెచ్చుకున్నారన్నారు. జగన్ ప్రభుత్వానికి నెలలు కాదు.. ఇంకా రోజులే ఉన్నాయని తెలిపారు. జగన్‌కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని అన్నారు. నాలుగు సంవత్సరాల కాలంలో ఒక ఇటుక వేయలేదని.. ఇప్పుడు పోర్ట్, ఎయిర్ పోర్టు కడతామంటే ఎవరూ నమ్మరన్నారు. సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన చేస్తామంటే.. ప్రజలు విశ్వసించడం లేదని అన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు సీఎం కావడం చారిత్రాత్మక అవసరమని చెప్పుకొచ్చారు. అందుకే బాబు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా.. ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారని తెలిపారు. తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత నిజమో.. వచ్చే ఎన్నికల్లో బాబు సీఎం కావడం అంతే నిజం అని స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలు, అన్యాయాల్లోనే వైసీపీ ప్రభుత్వం మొదటి స్ధానంలో నిలబడిరదని విమర్శించారు. తాను కూడా ఒక విద్యార్ధిని దత్తత తీసుకుంటానని గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.









