AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎండవేడి తాళలేక మెట్రోకి క్యూ కడుతున్న జనం

కిక్కిరిసిపోయిన మెట్రో రైళ్లు

నగరంలో ఎండవేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.సూర్యుడి తాపానికి బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండతీవ్రత ఎక్కువగా ఉంటుండంతో..ఆఫీస్ లకు వెళ్లేందుకు ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఎండను తట్టుకోలేక మెట్రో ట్రైన్స్ కు క్యూ కడుతున్నారు. ఆర్టీసీలో ఏసీ బస్సులు లేకపోవడంతో .. మెట్రోను ఆశ్రయిస్తున్నారు. నగరంలోని అన్ని మెట్రో స్టేషన్లలో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిపోయాయి. ప్రధానంగా అమీర్ పేట, నాగోల్, రాయదుర్గం స్టేషన్లు పబ్లిక్ తో నిండిపోయాయి. కాగా నగరంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది.

ANN TOP 10