AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జోగురామన్నపై అఖిల పక్షం ఆగ్రహం

ఎమ్మెల్యే జోగురామన్నపై అఖిలపక్ష నేతలు భగ్గుమంటున్నారు. అమ్మన్యూస్‌పై అక్కసు వెళ్లగక్కడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రశ్నించేవారి గొంతునొక్కుతున్నారని మండిపడుతున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అక్రమాలు, అవినీతికి బయటపెట్టినందుకు ఓర్వలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని..ఇది మంచిపద్దతి కాదని అంటున్నారు. నిజాన్ని నిర్భయంగా చెబుతున్న అమ్మన్యూస్‌పై ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నారు.

అమ్మ న్యూస్ పై పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని.. ప్రజల పక్షాన పోరాడుతున్న అమ్మ న్యూస్ కు ప్రజల ఆశీర్వాదంతో పాటు రాజకీయ పార్టీల మద్దతు ఉంటుందని అంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు విధిస్తూ అక్రమ కేసులు పెడుతూ వేధిస్తుందని మండిపడుతున్నారు. ఏ పార్టీకి వత్తాసు పలకకుండా తెలంగాణ గుండె చప్పుడుగా దూసుకెళ్తున్న అమ్మ న్యూస్ పై విషం కక్కుతున్న జోగు రామన్న వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

ANN TOP 10