మహారాష్ట్రలోని ఛత్రపతి శంబాజీనగర్(ఔరంగబాద్) జిల్లా కేంద్రంలో ఈ నెల 24న భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్‌ఎస్ అధిష్ఠానం నిర్ణయించింది. పార్టీ నాయకులు అందుకు అవసరమైన ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ సభలో సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను వివరించడంతోపాటు మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలు, ఆ ప్రాంత పరస్థితులను గురించి ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది.
కాగా ఔరంగాబాద్‌లోని జబిందా మైదానంలో ఈనెల 24న బహిరంగ నిర్వహించేందుకు అక్కడి అధికారులు అనుమతులు నిరాకరించారు. మరో వేదికన సభను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీంతో పార్టీ నేతలు ప్రత్యామ్నాయ వేదిక కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.









