AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాహుల్ గాంధీకి బిగ్ షాక్.. పిటిషన్ ను కొట్టివేసిన సెషన్స్ కోర్టు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. రాహుల్ పిటిషన్ ను సూరత్ సెషన్స్ కోర్టు డిస్మిస్ చేసింది. మోడీ ఇంటిపేరుపై వ్యాఖ్యలపై సూరత్ కోర్టు ఇటీవల రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించింది. అయితే ఈ కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలంటూరాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌ను సూరత్‌లోని సెషన్స్ కోర్టు ఏప్రిల్ 20 గురువారం రోజున తోసిపుచ్చింది. ఈ కేసులో రాహుల్ కు రెండేళ్ల పాటు జైలుశిక్ష పడటంతో ఎంపీ పదవిపై అనర్హత వేటు పడింది.

ANN TOP 10