AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘అమ్మ’పై రామన్న అక్కసు..

నిజాలు నిర్భయంగా ప్రచారం చేస్తూ.. ప్రజలకు దగ్గరైన అమ్మ న్యూస్ ఛానల్ పై అధికార పార్టీ ఎమ్మెల్యే జోగు రామన్న అక్కసు వెల్లగక్కారు. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి ఎత్తిచూపిస్తూ.. పాలకుల ఆగడాలను ప్రశ్నిస్తున్న అమ్మ న్యూస్ ఛానల్ పై కుట్రలకు తెరతీశారు. అక్రమ కేసులతో మీడియా గొంతు నులిమే ప్రయత్నం చేశారు.

పార్టీలకు అతీతంగా.. వాస్తవాలే ఆధారంగా అమ్మన్యూస్ ఛానల్.. జనం గుండెల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. ప్రజల పక్షాల నిలబడుతూ స్థాపించిన కొద్దికాలంలోనే విశేష ఆదరణ పొందింది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, వైఎస్సార్టీపీ, సీపీఐ,సీపీఎం, టీజేఎస్, బీఎస్పీ… ఇలా అన్ని రాజకీయ పార్టీల వార్తలను ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది అమ్మ న్యూస్. ఏ పార్టీ పక్షం వహించకుండా.. నిజాలను నిర్భయంగా ప్రసారం చేస్తూ.. మీడియా రంగంలో ఓ జ్యోతిలా ప్రకాశిస్తుంది.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సమస్యలను కళ్లకు కట్టినట్టు ప్రజలకు చూపిస్తుంది. వాటి పరిష్కారానికి దోహదపడుతుంది. అక్షరమే ఆయుధంగా జిల్లాల్లో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా పడి ఉన్న సమస్యలపై కథనాలు ప్రసారం చేసి.. ప్రజల మన్ననలు పొందుతుంది. ప్రజల కష్టాలను ప్రభుత్వానికి చూపించి.. వారి కన్నీరు తుడిచే అమ్మగా పేరుగాంచింది. కేవలం ప్రజల ఇక్కట్లే కాకుండా.. పాలకుల వైఫల్యాలను సైతం ఖరాఖండిగా చూపించింది. అవినీతిని, అక్రమాలను ఎండగడుతూ.. ముందుకు దూసుకెళ్తుంది.

అలాంటి అమ్మన్యూస్ పై అక్రమ కేసులతో కక్ష్యసాధింపు చర్యలకు దిగారు పాలకులు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల్లో గెలిచి తిరుగులేని నాయకుడిగా పేరుగాంచిన జోగురామన్న.. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు.

తాగునీరు, రోడ్డు, రవాణా, యువతకు ఉద్యోగాలు, పేదలకు ఇళ్లు, కాలనీల్లో మౌళిక సదుపాయాల కల్పన.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఎమ్మెల్యే నిర్లక్ష్యానికి ఆదిలాబాద్ ప్రజలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. తమ తరుపున నిలబడి ప్రశ్నించే వారు లేక.. పాలకుల ఆగడాలను మౌనంగా భరిస్తూ వచ్చారు. అలాంటి సమయంలోనే జోగు రామన్నకు ప్రత్యర్థిగా.. ప్రజా నాయకుడిగా ఆదిలాబాద్ బిడ్డల పక్షాన ప్రజా గొంతుకలా మారారు కంది శ్రీనివాస రెడ్డి.

ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ.. నియోజకవర్గంలోని ప్రతి సమస్యను పరిశీలిస్తూ.. ప్రజలకు భరోసానిస్తూ.. కష్టాలు తీరుస్తూ.. కంది శ్రీనివాస రెడ్డి ప్రజల ఆశీస్సులు అందుకుంటున్నారు. నిత్యం ప్రజాక్షేత్రంలో నిలబడి స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రశ్నించే వారు లేక ఇన్నాళ్లు యథేచ్చగా సాగిపోయిన ఎమ్మెల్యే అక్రమాలకు కంది శ్రీనివాస రెడ్డి కళ్లెం వేసినట్లయింది.

ఇలా ఆదిలాబాద్ రాజకీయాలను, నియోజకవర్గ సమస్యలను ప్రజలకు చూపించింది అమ్మ న్యూస్. తన వైఫల్యాలను, అన్యాయాన్ని, దోపిడిని ప్రజాలోకానికి చూపించడాన్ని ఓర్వలేని జోగురామన్న.. అమ్మ న్యూస్ పై అక్రమ కేసులు నమోదు చేశారు. నాణేనికి రెండోవైపు చూపితే జీర్ణించుకోలేకపోతున్న జోగు రామన్న.. స్వయంగా మీడియా సమావేశం పెట్టి.. ‘అమ్మ’ పై అసూయ కనబరిచారు.రాజకీయకక్షలను మీడియాపై రుద్దే ప్రయత్నం చేశారు. అమ్మ న్యూస్ పై జోగు రామన్న కుమారుడు జోగు మహేందర్ .. పోలీసులకు ఫిర్యాదు చేశారు.అమ్మన్యూస్ డైరక్టర్లకు నోటీసులు ఇచ్చారు.అయితే ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు అమ్మన్యూస్ ‘అదరదు బెదరదు’ అని, తాము ఎవరిపక్షం వహించమని అమ్మన్యూస్ స్పష్టం చేసింది. ఇలాంటి అక్రమ కేసులను న్యాయపరంగా ఎదుర్కుంటామని అమ్మ న్యూస్ యాజమాన్యం వెల్లడించింది. ప్రజాక్షేత్రంలో తనను నిలదీస్తున్న కంది శ్రీనివాస రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక.. ఆయనకు సంబంధించిన ఛానల్ పై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

ANN TOP 10