AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రీతి కేసులో సైఫ్‌కు బెయిల్‌ మంజూరు

తెలంగాణలో సంచలనం రేపిన డాక్టర్‌ ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడు సైఫ్‌కు బెయిల్ వచ్చింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం, వరంగల్‌ జిల్లా రెండో అదనపు జిల్లా కోర్టు నిబంధనలతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు.. ఈ మేరకు ఉత్తర్వులు కూడా వచ్చాయి. సైఫ్‌కు రూ.10 వేల సొంత పూచీకత్తుతో పాటు అంతే మొత్తానికి ఇద్దరి నుంచి పూచీకత్తును కోర్టుకు సమర్చించాలని కోర్టు సూచించింది.

అలాగే సైఫ్ ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య 16 వారాల పాటు కేసు విచారణ అధికారి దగ్గర హాజరు కావాలని కోర్టు సూచించింది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు కోరవచ్చని జడ్జి ఉత్తర్వులో పేర్కొన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులను బెదిరించే ప్రయత్నం చేయకూడదని హెచ్చరించారు.

ANN TOP 10