ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)లో అటు సీబీఐ (Central Burew Of Investigation), ఇటు ఈడీ (Enforcement Directorate) దూకుడు పెంచింది. ఈ కేసులో ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మాజీ సీఏ బుచ్చిబాబు, అలాగే గౌతమ్ మల్హోత్రా (Goutham Malhothra)ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఒయాసిస్ గ్రూప్ తో మల్హోత్రాకు సంబంధాలున్నాయని అనుమానాలు, ఆరోపణల నేపథ్యంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇప్పుడు ఢిల్లీకి చెందిన అమన్ దీప్ సింగ్ ను సీబీఐ అదుపులోకి తీసుకుంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)లో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన సీబీఐ (Central Burew Of Investigation) తాజాగా మరొకరిని అదుపులోకి తీసుకుంది. ఢిల్లీకి చెందిన అమన్ దీప్ సింగ్ ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. అనంతరం అతడిని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచగా..3 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. కాగా అమన్ సింగ్ ను గతంలో ఈడీ (Enforcement Directorate) అధికారులు కూడా అరెస్ట్ చేశారు.









