AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భూదాన్ భూములు అన్యాక్రాంతం : కోదండ రెడ్డి

కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అనేక అరాచకాలు జరుగుతున్నాయని ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో భూ కుంభకోణాలు జరుగుతున్నాయని.. భూదాన్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని అన్నారు. గాంధీభవన్ వేదికగా ఆయన రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ఎండగట్టారు.కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో భూదాన్ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడామని.. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక భూదాన్ బోర్డ్ రద్దు చేశారని తెలిపారు. బోర్డు రద్దుతో భూములకు రక్షణ కరువైందని ఆరోపించారు.

దేశ సంపదను ప్రధాని మోదీ అదానీ,అంబానీలకు కట్టబెట్టినట్టే..కేసీఆర్ కూడా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.కేసీఆర్ సర్కార్ అవినీతిపై ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలు..కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.కేంద్రం ITIR ఇవ్వలేదని కేటీఆర్ ఇప్పుడు చెప్పడం సిగ్గుచేటు అని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు పగటి వేషగాళ్లు మాట్లాడినట్లు వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమనేది వారి పగటి కలే అని తెలిపారు.

ANN TOP 10