AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రైతులకు కేంద్రం బంపర్ ఆఫర్.. 14 రకాల పంటలకు మద్దతు ధర పెంపు..!

2026-27లో ఖరీఫ్ సీజన్‌‌కు గాను 14 రకాల ఖరీఫ్ పంటలపై కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం చారిత్రాత్మక, రైతు పక్షపాత నిర్ణయం తీసుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రధాని మోడీ మన రైతన్నల సంక్షేమం, శ్రేయస్సుపై ఎల్లప్పుడూ పూర్తి అంకితభావంతో ఉందన్నారు.

 

వివరాలిలా..

ఈ కనీస మద్దతు ధర పెంపులో అత్యధికంగా.. పొద్దుతిరుగుడు(సన్‌ఫ్లవర్) గింజలపై క్వింటాల్‌కు రూ.622, పత్తిపై క్వింటాల్‌కు రూ.557, వలిసెల(నైజర్ సీడ్)పై క్వింటాల్‌కు రూ.515, నువ్వులపై క్వింటాల్‌కు రూ.500 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ కీలక నిర్ణయం రైతులు పండించిన పంటలకు లాభదాయకమైన గిట్టుబాటు ధరను అందించడమే కాకుండా, వారి ఆదాయ భద్రతను పటిష్టం చేస్తుందన్నారు. అలాగే భారత వ్యవసాయ రంగాన్ని స్వయం సమృద్ధి, అభివృద్ధి పథంలో మరింత బలోపేతం చేస్తుందన్నారు. అన్నదాతల సంక్షేమానికి అంకితమైన ఈ ప్రాధాన్యతా నిర్ణయాన్ని తీసుకున్న ప్రధాని మోడీకి రాంచందర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.

ANN TOP 10