AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పోక్సో కేసులో కీలక పరిణామం.. పోలీసులకు బండి భగీరథ్ లేఖ..!

బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీసులకు భగీరథ్ ఓ లేఖ పంపించారు. ఇవాళ మధ్యాహ్నం పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోయినట్లు లేఖలో తెలిపారు. అయితే మే 15వ తేదీన సిట్ విచారణకు వస్తానని స్పష్టం చేశారు.

 

విచారణకు హాజరయ్యే సమయంలో కీలక ఆధారాలు, సాక్ష్యాలతో వస్తానని బండి భగీరథ్ లేఖలో పేర్కొన్నారు. సిట్ అధికారుల దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. ఈ కేసు దర్యాప్తునకు అవసరమైన సమాచారాన్ని సైతం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు భగీరథ్ లేఖలో తెలియజేశారు. దీంతో ఈ నెల 15న జరిగే విచారణ.. బండి కుమారుడి కేసుకు సంబంధించి కీలక మారే అవకాశముంది.

 

వాస్తవానికి ఇవాళ (బుధవారం) మధ్యాహ్నం 2 గంటల లోపు పేట్ బషీర్ పేట్ పోలీసు స్టేషన్ లో విచారణకు రావాలని మంగళవారమే బండి భగరీథ్ కు సూచించారు. ఈ మేరకు కరీంనగర్ లోని ఆయన మేనమామకు నోటీసులు సైతం ఇచ్చారు. కానీ అతడు హాజరుకాకపోవడంతో పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారన్న చర్చ మెుదలైంది. పోక్సో కేసులో సిట్ విచారణకు హాజరుకాకపోతే.. నిందింతులు ఎవరైన చట్టపరమైన చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అరెస్టు వారెంట్, మధ్యంతర బెయిల్ రద్దు, నాన్ బెయిలబుల్ వారెంట్ వంటివి జారీ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే తన గైర్హాజరికి సంబంధించి బండి భగరీథ్ లేఖ రూపంలో వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

 

మరోవైపు కేసు దర్యాప్తు తీరుపై స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో నిష్పాక్షిక దర్యాప్తు కోసం డీజీపీ సీ.వీ.ఆనంద్ సిట్ ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కేసును కూకట్ పల్లి జోన్ డీసీపీ రితి రాజ్ విచారణ చేస్తున్నారు. దర్యాప్తు బాధ్యతలు అప్పగించిన మొదటి రోజే పేట్ బషీరాబాద్ స్టేషన్ కు వెళ్లిన ఆమె ఏసీపీ, సీఐలతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకున్నారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతోపాటు బాధితురాలి వాంగ్మూలాన్ని కూడా పరిశీలించారు. ఆ మరుసటి రోజు బాధితురాలిని పిలిపించి రెండోసారి స్టేట్ మెంట్ తీసుకున్నారు. ఈ క్రమంలో వెల్లడైన వివరాలతో సెక్షన్లను మార్చారు.

ANN TOP 10