కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. మైనర్ బాలికపై లైంగిక దాడి చేశాడనే ఆరోపణలతో అతనిపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలంటూ సిట్ నోటీసులు పంపించింది. రేపు మధ్యాహ్నం రెండు గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది.
బండి భగీరథ్ కేంద్ర మంత్రి కుమారుడు కావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. కేసు విచారణ పారదర్శకంగా జరగాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీని ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ కేసు సిట్ విచారిస్తోంది. బండి భగీరథ్‌పై బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మరోవైపు, తనను హనీట్రాప్ చేశారని బండి భగీరథ్ కరీంనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.







