AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

2 భాగాలుగా విశ్వంభర..?

మెగాస్టార్ చిరంజీవి ఏడు పదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇకపోతే చిరంజీవి ఎన్ని సినిమాలతో వచ్చినా.. అభిమానుల చూపు మాత్రం సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతున్న విశ్వంభర పైనే అనే చెప్పాలి. ఎప్పుడో ఏడాది క్రితమే విడుదల కావాల్సిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. పైగా వీఎఫ్ఎక్స్ కారణంగా ఈ సినిమా వాయిదా పడుతోందని చెప్పవచ్చు. ఇకపోతే ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న నేపథ్యంలో అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఒకటి ఆశ్చర్యపరుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే ..ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల చిత్రాలు దాదాపు రెండు భాగాలుగా విడుదలై అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే.

 

విశ్వంభరపై అదిరిపోయే న్యూస్..

ఈ నేపథ్యంలోనే విశ్వంభర సినిమా కూడా 2 భాగాలుగా విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలే సోషియో ఫాంటసీ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులు.. ఇప్పుడు రెండు భాగాలుగా రాబోతుందని తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరి నిజంగానే ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందా? లేదా? అనేది తెలియాలి అంటే ఇంకొంతకాలం లేచి చూడాల్సిందే. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తూ ఉండగా.. వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రం అత్యంత భారీ గ్రాఫిక్స్ తో రూపొందుతోంది. ఇకపోతే ఎప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనే విషయంపై స్పష్టత లేదు.

 

చిరంజీవి సినిమాలు.

చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక అదే జోరు మీద ఉన్న చిరంజీవి , శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న చిత్రంలో నటించనున్నారు. అలాగే బాబి కొల్లి దర్శకత్వంలో మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఇదివరకే బాబీతో వాల్తేరు వీరయ్య సినిమా చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిరంజీవి.. ఇప్పుడు ముంబై మాఫియా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాతో ఇంకెలాంటి విజయాలను సొంతం చేసుకుంటారో చూడాలి. ఇకపోతే గతంలో పూరీ జగన్నాథ్ తో ఆటో జానీ అనే టైటిల్ తో ఒక ప్రాజెక్టు రూపొందుతోంది అని వార్తలు రాగా.. అది కేవలం వార్తలు గానే మిగిలిపోయాయి. ఏది ఏమైనా ఏడు పదుల వయసులో కూడా విభిన్నమైన జానర్లలో సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు చిరంజీవి. మరి విశ్వంభర సినిమాతో ఎప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తారో చూడాలి

ANN TOP 10