AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పెద్ది ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్..! ఎప్పుడంటే..?

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం పెద్ది(Peddi). ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదల కూడా వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఏప్రిల్ 30వ తేదీ నుంచి ఈ సినిమా వాయిదా పడుతూ జూన 4న విడుదలకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా విడుదలకు కేవలం 20 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా నిర్వహిస్తూ వస్తున్నారు.

 

విడుదలకు సిద్ధంగా పెద్ది ట్రైలర్..

ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలను రిలీజ్ చేయగా ఈ రెండు పాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచడమే కాకుండా సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. అలాగే ఈ సినిమా నుంచి రెండు గ్లింప్స్ వీడియోలను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఈ వీడియోలు కూడా సినిమాపై భారీ అంచనాలను కలిగించాయి. ఇకపోతే ఈ సినిమా నుంచి మరొక అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయాలని అభిమానులు కోరారు అందుకు అనుగుణంగానే ట్రైలర్ వీడియో కూడా విడుదలకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది.

 

మే 18న పెద్ది ట్రైలర్..

గత వారం రోజులుగా పెద్ది సినిమా ట్రైలర్ గురించి ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ రెండు తెలుగు రాష్ట్రాలలో కాకుండా పాట్నాలో విడుదల చేయబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అయితే ఈ వార్తలకు తెరదించుతూ చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ గురించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. తాజాగా చిత్ర బృందం ఒక పోస్టర్ విడుదల చేస్తూ పెద్ద సినిమా ట్రైలర్ మే 18 వ తేదీ విడుదల కాబోతున్నట్లు తెలియజేశారు. మరి ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎక్కడ నిర్వహించబోతున్నారనే వివరాలు తెలియాల్సి ఉంది.

 

ఇలా ఈ సినిమా ట్రైలర్ మే 18న విడుదల కాగా ఈ సినిమా జూన్ 4 వ తేదీ ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఇక జూన్ 3న వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ ప్రసారం కాబోతున్నట్లు చిత్ర నిర్మాతలు తెలియజేశారు. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ కాగా చాలా మంచి ఆదరణ లభిస్తుంది. మరి భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పెద్ది సినిమాకు ఏ విధమైనటువంటి ఆదరణ లభిస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించగా రామ్ చరణ్ జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాని వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరి జూన్ 4వ తేదీ పెద్ది థియేటర్లలో ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టించబోతున్నారనేది తెలియాల్సి ఉంది.

ANN TOP 10