AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రైతన్నలకు మళ్ళీ షాక్..! మళ్లీ పెరిగిన ధరలు..?

ఆరుగాలం శ్రమించి పంటలు పండించి అందరి ఆకలి తీర్చే రైతన్నపై ఎరువుల ధరల పెరుగుదల ఏటా ఉంటోంది.ఈ ఏడాది కాంప్లెక్స్ ఎరువుల ధరలను ఆయా కంపెనీలు నాలుగు సార్లు పెంచడంతో రానున్న వర్షాకాలంలో పంటల సాగు మరింత భారం కానుంది. గత వాహన కాలం సీజన్ లో బస్తాకు 50 ఈ యాసంగి సీజన్ లో రూ. 50 చొప్పున రెండుసార్లు కలిపి 100 పెంచారు. తాజాగా నాలుగోసారి బస్తాకు రూ 225 నుంచి 300 పెంచడంతో రానున్న సీజన్ లో రైతులపై ఎరువుల ధరల పెరుగుదల ప్రభావం పడనుంది. కాంప్లెక్స్ ఎరువులు వినియోగం జిల్లాలో వివిధ పంటలకు అధికంగా ఉంటుంది.

 

రైతులపై భారం

గ్రామాలలో పశుసంపద తగ్గిపోవడం, సేంద్రియ ఎరువులు లేకపోవడంతో పంటలకు పోషకాలను అందించేందుకు రసాయన ఎరువుల వాడకం తప్పనిసరి అవుతోంది.జిల్లాలో వానకాలం సాధారణ సాగు 3.92 లక్షల ఎకరాలు వివిధ పంటల్లో రూపంలో ఉంటుంది.జిల్లాలో ప్రధానంగా వరి,పత్తి,మిర్చి,మొక్కజొన్న, పొగాకు ఇతర ఉద్యానవన పంటలను సాగు చేస్తున్నారు. రెండు సీజన్లకు కలిపి ఎరువుల వినియోగం అధికంగా ఉంటుంది. దీంతో రైతులకు కోట్లలో భారం పడనుంది.

 

పెరిగిన ధరలతో రైతులకు కష్టం

పంటలకు పోషకాలను అందించేందుకు రసాయన ఎరువుల వాడకం తప్పనిసరి అవుతుంది. జిల్లాలో వానకాలం సాగు జిల్లాల్లో ప్రధానంగా వరి,ప్రతి, మిర్చి,జొన్న, పొగాకు,మొక్కజొన్న ఇతర కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుత రబీలో మొక్కజొన్న అలసంద, పెసర,వేరుశనగ, కూరగాయలు సాగు చేసి రైతులు కాంప్లెక్స్ ఎరువుల కోసం వెళితే పెరిగిన ఎరువుల ధరల బస్తాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కంపెనీలు అన్ని రకాల కాంప్లెక్స్ పెంచడంతో ఈసారి కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలు కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచినట్లు సమాచారం ఉందని ఫర్టిలైజర్ షాప్ యజమానులు చెబుతున్నారు.

ANN TOP 10