AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ కు పరామర్శ.. చంద్రబాబుతో భేటీ.!

భారత ప్రధాని నరేంద్ర మోదీ తన హైదరాబాద్ పర్యటనలో భాగంగా జూబ్లీహిల్స్‌లోని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. ఇటీవల సైనస్ సమస్య కారణంగా శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్‌ను ప్రధాని ఆత్మీయంగా పరామర్శించారు.

 

ఈ భేటీలో ప్రధాని మోదీ పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాదాపు 15 నిమిషాల పాటు ఆయనతో గడిపిన ప్రధాని.. పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తనను పరామర్శించేందుకు స్వయంగా ఇంటికి వచ్చినందుకు పవన్ కళ్యాణ్ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీయే (NDA) కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్‌ను ప్రధాని వ్యక్తిగతంగా పరామర్శించారు.

 

పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన అనంతరం.. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. చంద్రబాబు నివాసంలో ప్రధానికి ఘనస్వాగతం లభించింది. చంద్రబాబుతో పాటు ఆయన భార్య భువనేశ్వరి.. కుమారుడు నారా లోకేష్.. కోడలు బ్రాహ్మిణి ప్రధానిని సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబుతో ప్రధాని సుమారు సుమారు 60 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉభయ రాష్ట్రాల అభివృద్ధి.. కేంద్ర-రాష్ట్ర సంబంధాలు.. కూటమి రాజకీయాలపై చర్చలు జరిగినట్లు సమాచారం.

ANN TOP 10