AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేషన్ బియ్యం అక్రమ తరలింపు దారులపై ఉక్కు పాదం…

 

కాకినాడ పోర్టు నందు 5 లారీలలో (28 తారీకు నుండి 15 తారీకు వరకు) టన్నులు కొలది PDS బియ్యం అక్రమంగా తరలిస్తుండగా జిల్లా పౌరసరఫరాధికారి, కాకినాడ మరియు వారి సిబ్బంది సీజ్ చేయటం జరిగినది.

సదరు లారీలలో:
– (గోల్డెన్ ఆగ్రోస్, గాడాల)
– (గురుదత్త రైస్, రాజానగరం)
– (శ్రీ బాలాజీ బాయిల్డ్ అండ్ రా రైస్ మిల్, జగ్గంపేట)
– (ఆగ్రోస్, విశాఖపట్నం)
– (శ్రీ లక్ష్మీ శ్రీనివాస రైస్ మిల్, మోతుకూరు)

మొత్తం 140 మెట్రిక్ టన్నుల బియ్యం అక్రమంగా కాకినాడ పోర్టు ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి అవుతుండగా సీజ్ చేయడం జరిగింది.
జిల్లా పౌరసరఫరాధికారి కాకినాడ వారు తెలిపిన వివరం ప్రకారం, జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు పోర్టులో తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, అక్రమంగా PDS బియ్యం కొన్న, అమ్మిన, రీసైకిలింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

ANN TOP 10