AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బోల్తా పడిన స్కార్పియో వాహనం ముగ్గురికి గాయాలు…

అన్నమయ్య జిల్లా
సెంటర్: రాయచోటి

 

అన్నమయ్య జిల్లా రాయచోటిలో గాలివీడు రింగ్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే. రాయచోటి రింగ్ రోడ్డు పరిధిలోని గాలివీడు-వరిగ మార్గంమధ్యలో స్కార్పియో వాహనం బోల్తాపడి ముగ్గురికి గాయాలైనట్లు సమాచారం. సినిమా చిత్రీకరణను తలదన్నేలా స్కార్పియో వాహనం పల్టీలు కొట్టుకుంటూ రోడ్డుకు పడమటి వైపున ఉన్న రాళ్లకుప్పపై పడింది. వాహనం రాయచోటి పట్టణ టీడీపీ నాయకునికి చెందినది కావడం గమనార్హం. దీంతో గాయపడ్డ వారిని గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయిం చినట్లు తెలిసింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించినప్పటికీ వారికి ఈ సంఘటనపై ఫిర్యాదు అందకపో వడంతో పోలీసులు కేసు నమోదు చేస్తారా లేదా అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది?

ANN TOP 10