సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను టార్గెట్ చేశారు. ఆయన సోసల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ నుంచి ఫొటోలు సేకరించిన కేటుగాళ్లు.. వాటిని మార్ఫింగ్ చేసి న్యూడ్ కాల్స్ చేసినట్టు వీడియో తయారు చేశారు. ఆ వీడియోను వాట్సాప్ ద్వారా ఎమ్మెల్యే వీరేశంకు పంపి, డబ్బులు డిమాండ్ చేశారు. లేదంటే వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామంటూ బ్లాక్‌మెయిల్ చేశారు. దాంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు.









