AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాజ్‌భ‌వ‌న్‌లో గవర్నర్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌తో సీఎం రేవంత్ రెడ్డి బుధ‌వారం రాత్రి భేటీ అయ్యారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, గుత్తా అమిత్ రెడ్డి ఉన్నారు.

రాష్ట్రంలో బుధ‌వారం నుంచి ప్రారంభమైన సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులసర్వే తీరును గవర్నర్‌కు సీఎం రేవంత్ రెడ్డి వివ‌రించారు. ఈ ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలను గవర్నర్‌కు తెలిపారు. ఈ సర్వే విష‌యంలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా నిలవనుందని సీఎం పేర్కొన్నారు. 2025లో చేపట్టే దేశవ్యాప్త జనగణలో తెలంగాణ సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులసర్వేను పరిగణలోకి తీసుకునే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని గ‌వ‌ర్న‌ర్‌ను సీఎం కోరారు. ఈ సందర్భంగా తన సోదరుడి కూతురు వివాహానికి గవర్నర్‌ను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

ANN TOP 10