AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హామీలు ఎగ్గొట్టడంలో, అప్పులు తేవడంలో బీజేపీ ప్రపంచ రికార్డు.. పొన్నం ఫైర్!

అప్పులు తేవ‌డంలో మీది ప్ర‌పంచ రికార్డు అంటూ కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్ పై మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఫైర్ అయ్యారు.తెలంగాణ‌లో ఆరు గ్యారెంటీలు అమ‌లుకావ‌డం లేద‌ని బండి సంజ‌య్ విమ‌ర్శించారు. దీనిపై నేడు స్పందించిన పొన్నం మాట్లాడుతూ.. ఢిల్లీ చెప్పులు మోసే గుజరాత్ గులాములు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హామీలు ఎగ్గొట్టడంలో, అప్పులు తేవడంలో బీజేపీ ప్రపంచ రికార్డు సాధించింద‌ని మండిప‌డ్డారు. రైతులకు ప్రతి నెలా పింఛన్, పేదలకు ఉచిత విద్యుత్, సామాన్యుల అకౌంట్లలో రూ. 15 లక్షలు, రెండు కోట్ల ఉద్యోగాలు, విభజన హామీలు.. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు ఎగ్గొట్టిన హామీలు చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారని అన్నారు.

అప్పుల విషయానికొస్తే.. మీరు తెచ్చిన 150 లక్షల కోట్ల అప్పులు దేశానికి గుదిబండగా మారాయని విమర్శించారు. ఏటా మీ అప్పులకు వడ్డీలు కట్టేందుకే 11 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల బీజేపీ పాలనలో విద్వేశ ప్ర‌చారం, విధ్వంస చ‌ర్య‌లు త‌ప్ప దేశానికి చేసింది శూన్యమని అన్నారు. కానీ కోతలు, వాతలతో సామాన్యుల నడ్డి విరచడంలో నిష్ణాతులని విమ‌ర్శించారు.

ఆడబిడ్డల ప్రసూతి ప్రయోజనాల్లో కోత, విద్యార్థుల స్కాలర్ షిప్స్‌లో కోత, వయోవృద్ధుల రైలు ప్రయాణ రాయితీలకు కోత, రేషన్ కార్డుల్లో కోత, ఎరువుల సబ్సిడీలో కోత, గ్యాస్ సబ్సిడీలో కోత, ఉపాధి హామీ నిధుల్లో కోత, ఫసల్ బీమా లో కోత, సెస్ ల పేరుతో సామాన్యుల జేబులకు చిల్లులు, పెట్రోల్ డీజిల్ ధరల వాతలు మీ పాలన వైఫల్యానికి నిదర్శనాలని పేర్కొన్నారు. అటువంటి మీరు 10 నెలల ప్రజా ప్రభుత్వంపై మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగానే ఉందని అన్నారు. చేతనైతే తెలంగాణ హక్కులను కాపాడాలని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రప్పించాలని సవాల్ చేశారు. అంతేకానీ అవాకులు చవాకులు పేలితే తెలంగాణ సమాజం మిమ్మల్ని   క్షమించద‌ని హెచ్చ‌రించారు.

ANN TOP 10