AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హీరోలకు డైరెక్టర్లు లైఫ్ ఇస్తారా? – విశ్వక్ సేన్ సూటి సమాధానం

ఒక హీరోకి దర్శకుడి వల్లే కెరీర్ లేదా లైఫ్ దొరికిందని అనడం సరైన పద్ధతి కాదని విశ్వక్ సేన్ అభిప్రాయపడ్డారు. ఎవరైనా దర్శకుడు తన వల్లే ఫలానా హీరోకి లైఫ్ వచ్చిందని చెప్పుకుంటే అది గర్వంగా అనిపిస్తుందని, అటువంటి ధోరణిని తాను సమర్థించనని చెప్పారు. ఇందుకు ఉదాహరణగా దర్శకుడు తరుణ్ భాస్కర్ గురించి ప్రస్తావిస్తూ.. ‘పెళ్లి చూపులు’ సినిమాతో విజయ్ దేవరకొండ, ప్రియదర్శి వంటి ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేసినా, తరుణ్ ఎప్పుడూ ఆ క్రెడిట్ తనది అన్నట్లు ప్రవర్తించరని, ఆ వినయమే తనకు నచ్చుతుందని విశ్వక్ పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ ట్రోలింగ్స్ గురించి మాట్లాడుతూ, తాను వాటిని అస్సలు పట్టించుకోనని స్పష్టం చేశారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా తాను ఒకేలా ఉంటానని, తన సినిమాలే ట్రోలర్లకు సమాధానం చెబుతాయని విశ్వక్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇన్ స్టా గ్రామ్ లో మాత్రమే యాక్టివ్‌గా ఉంటున్నానని, గతంలో ‘లైలా’ సినిమాతో లేడీ గెటప్ వేయాలనే తన కోరిక నెరవేరినప్పటికీ, ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదని నిజాయితీగా ఒప్పుకున్నారు. ఒక సినిమా ఫలితం విడుదల రోజే తనకు అర్థమైపోతుందని, ఆ తర్వాత దాని గురించి చింతించకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తానని చెప్పారు.

విశ్వక్ సేన్ సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్న ‘ఫంకీ’ మూవీకి ‘జాతి రత్నాలు’ ఫేం అనుదీప్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలో సాగే పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్ అని, ఇందులో సుమారు 150 మంది కొత్త నటీనటులను పరిచయం చేస్తున్నామని విశ్వక్ తెలిపారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన టీజర్ ఇప్పటికే ప్రేక్షకులలో మంచి అంచనాలను పెంచింది.

ANN TOP 10