AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పోలీసుల విచారణకు హాజరైన కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల మోకల పోలీసుల ఎదుట విచారణకు వచ్చారు. జన్వాడ ఫామ్ హౌస్ కేసులో విచారణకు రావాలని రాజ్ పాకాలకు రెండు రోజుల క్రితం పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిపై రాజ్ పాకాల హైకోర్టుల లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్ పాకాలకు రెండు రోజులు సమయం ఇవ్వాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే రెండు రోజుల గడువు ముగియడంతో రాజ్ పాకాల విచారణకు హాజరుకాక తప్పలేదు. ఆయన తన అడ్వకేట్ తో పోలీసుల విచారణకు వచ్చారు.

పోలీసుల విచారణలో రాజ్ పాకాల ఏం చెప్పారు అనేది చర్చనీయాంశంగా మారింది. కాగా శనివారం రాత్రి జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ జరిగింది. దీనిపై పోలీసులకు సమాచారం రావడంతో దాడులు చేశారు. అక్కడ భారీ ఎత్తు విదేశీ మద్యం, క్యాసినో గేమ్ కు సంబంధించి వస్తువులు దొరికాయి. ఈ పార్టీలో పురుషులు, మహిళలు పాల్గొన్నారు. మొదటగా కేటీఆర్ కుటుంబ సభ్యులు ఈ పార్టీలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. పోలీసుల సోదాలకు 20 నిమిషాల ముందే కేటీఆర్ అక్కడి నుంచి వెళ్లారని సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొట్టాయి.

పార్టీలో పట్టుబడిన వారికి పోలీసులు డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. మహిళలు మాత్రం పోలీసులను బుతులు తిడుతూ శాంపిల్స్ ఇవ్వలేదని తెలిసిందే. దీంతో వారిని వదిలిపెట్టారు. పురుషుల్లో విజయ్ మద్దూరి శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించారు. మూడు గంటల పాటు ఇబ్బంది పెట్టిన అతను చివరికి శాంపిల్ ఇచ్చాడు. అతనికి డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. తనకు రాజ్ పాకాలే డ్రగ్స్ ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత విజయ్ మద్దూరు మొబైల్ పోలీసులు స్వాధీనం చేసుకుని విడిచిపెట్టారు. ఆ తర్వాత విజయ్ మద్దూరి ఓ వీడియో విడుదల చేశారు. పోలీసులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈలోగా తన ఫోన్ ఇవ్వాలని ఓ మహిళ మోకిల పోలీస్ స్టేషన్ కు వచ్చింది. విజయ్ మద్దూరి మీకు ఇచ్చిన ఫోన్ తనదేనని పేర్కొన్నారు. దీంతో విజయ్ మద్దూరి పోలీసులను అమాయకులను చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పోలీసులు విజయ్ మద్దూరి ఫోన్ చేయడానికి ప్రయత్నించగా.. స్వీచ్ఛాఫ్ వచ్చింది. ఈ కేసులో రాజ్ పాకాల, విజయ్ మద్దూరిని నిందితులుగా పేర్కొన్నారు. అందుకే విచారణకు రావాలని రాజ్ పాకాలకు నోటీసులు ఇచ్చారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10