AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎలాన్‌ మస్కా.. మజాకా.. తన పిల్లల కోసం.. ఏకంగా..

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. తన మొత్తం 11 మంది పిల్లలు, భార్యలను ఒకే చోట ఉంచేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మస్క్‌ టెక్సాస్‌లోని ఆస్టిన్‌ లో రూ.35 మిలియన్‌ డాలర్ల (రూ. 2,94,29,12,000) విలువైన 14,400 చదరపు అడుగుల భవనం, దాని పక్కనే ఉన్న మరో ఆరు పడకగదుల ఆస్తిని దక్కించుకున్నాడని తెలుస్తోంది.

అందరూ ఒకే చోట ఉంటే..
ఈ గ్రాండ్‌ మాన్షన్‌ టుస్కాన్‌ డిజైన్‌ను కలిగి ఉందని, ఎలాన్‌ మస్క్‌ టెక్సాస్‌ ఇంటి నుంచి ఇది కేవలం 10 నిమిషాల దూరంలో ఉందని ఓ నివేదిక తెలిపింది. అయితే తన అందరి పిల్లలతోపాటు తల్లులు కూడా ఒకే చోట ఉంటే ఒకరికి ఒకరు సహాయపడేందుకు అవకాశం ఉంటుందని మస్క్‌ భావించినట్లు తెలిసింది. ఇది తెలిసిన నెటిజన్లు ఎలాన్‌మస్క్‌ సంపదతో పోల్చితే ఇంటి కోసం వందల కోట్లు ఖర్చు చేయడం పెద్ద విషయమేమి కాదని అంటున్నారు.

పెళ్లి కాలేదు కానీ..
ఎలాన్‌ మస్క్‌ ప్రస్తుతం శివన్‌ గిల్లిస్‌తో రిలేషన్‌ షిప్‌లో ఉన్నారు. మస్క్‌కి శివోన్నె గిల్లిస్‌తో ముగ్గురు పిల్లలు ఉన్నారు. శివన్‌ గిల్లిస్‌ 2021లో కవలలకు జన్మనిచ్చారు. శివోన్‌ గిల్లిస్, ఎలోన్‌ మస్క్‌ ఇంకా అధికారికంగా వివాహం చేసుకోలేదు. మస్క్, జిలిస్‌ మధ్య వ్యక్తిగత సంబంధం 2022 నాటిది. ఆమె మస్క్, గిలిస్‌ వారి కవలలతో ఉన్న ఫొటోను పోస్ట్‌ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో మస్క్‌ చివరి పేరు, జిలిస్‌ చివరి పేర్లను భాగంగా చేర్చారు. ఆ తర్వాత మస్క్‌ జీవితచరిత్ర రచయిత వాల్టర్‌ ఐజాక్సన్‌∙సెప్టెంబర్‌ 2023లో వీరి సంబంధం గురించి సమాచారాన్ని అందించారు.

ఎంత మంది భార్యలంటే..
దీనికి ముందు కెనడియన్‌ సింగర్‌ గ్రిమ్స్, ఎలోన్‌ మస్క్‌లకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. గ్రిమ్స్, ఎలాన్‌∙మస్క్‌ వివాహం చేసుకున్నారు. అంతకంటే ముందు ఎలాన్‌ మస్క్‌ మొదటి భార్య జస్టిన్‌ విల్సన్‌కు 5 మంది పిల్లలు ఉన్నారు. వీరిలో ఇద్దరు పిల్లలు కవలలు కాగా, ముగ్గురు పిల్లలు కలిసి జన్మించారు. మొదటి ఇద్దరు కవలల పేర్లు జేవియర్, డామియన్‌. మస్క్‌ 2002 నుంచి ఇప్పటివరకు 11 మంది పిల్లలకు తండ్రయ్యాడు.

ఆయన మాజీ భార్య జస్టిన్‌ మస్క్‌తో మొదటి బిడ్డ కేవలం 10 వారాల వయస్సులో ఆకస్మిక శిశు మరణ సిండ్రోమ్‌తో మరణించింది. 2008లో ఈ జంట విడాకులు తీసుకునే ముందు ఐవీఎఫ్‌ను ఉపయోగించి ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10