మూడు దశాబ్దాలకు పైగా మానవ సేవయే మాధవ సేవగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నాసర్ పాష. మణుగూరు ప్రాంతంలో అందరికీ బాసటగా నిలుస్తున్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం తన ఉద్యోగ నిర్వహణలో కార్మికుల పక్షపాతిగా యజమాన్యం దృష్టికి పలు సమస్యలు తీసుకెళ్లి పరిష్కరించడంలో ఆయన ముందుంటారు. ఆయన చొరవ తెగువ కార్మికులకు మనోధర్యాన్ని చేకూరుస్తున్నాయి. ఇక నాసర్ దంపతులిద్దరు ఉద్యమ చైతన్యానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
అనాథ వృద్ధులు, అనాథ బాల బాలికల విద్యా వికాసానికి సింగరేణి ఉద్యోగుల తరఫున ఎన్నో ఎన్నెన్నో వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. సింగరేణి సేవా కార్యక్రమాలలో భాగంగా చుట్టుపక్కల సమాజానికి దూరంగా ఉన్న గిరిజన గ్రామాలకు సైతం నాసర్ సేవలు చిరస్మరణీయం. ఎంతో ఆదర్శమైన కమ్యూనిస్టు భావాలతో ముందుకు సాగే నాసర్ పాష ఆదర్శ భావాలతో కుల మతాలకు అతీతంగా అందరిలో ఒకడిగా సౌమ్యుడిగా అందరి మన్ననలు పొందుతున్నారు. సేవకు మారుపేరుగా బాధితులకు బాసటగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలలో ఒక ముత్యం గా నిలిచారు. నాసర్ పాష దంపతులకు హృదయపూర్వక సేవ అభినందనలు.









