AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జన్వాడ రేవ్ పార్టీ.. మోకిల పోలీసులు నోటీసులు.. హైకోర్టును ఆశ్రయించిన రాజ్‌ పాకాల

జన్వాడ రేవ్‌ పార్టీ వ్యవహారం కేటీఆర్‌ బావమదిరి రాజ్‌ పాకాల మెడకు చుట్టుకుంది. ఈ క్రమంలో మోకిల పోలీసులకు ఆయనకు నోటీసులు చేశారు. బీఎన్‌ఎస్‌ 35 (3 ) సెక్షన్‌ ప్రకారం ఈ నోటీసు జారీ చేశారు. పార్టీ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని నోటీసులో ప్రస్తావించారు పోలీసులు. సోమవారం తమ ముందు విచారణకు హాజరు కావాలన్నారు.

ఆధారాలు సమర్పించాలి..
అడ్రస్‌ ప్రూఫ్‌తోపాటు, కేసుకు సంబంధించిన ఇతర ఆధారాలు సమర్పించాలని కోరారు పోలీసులు. విచారణకు హాజరు కాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసులో స్పష్టం చేశారు. మోకిలా పీఎస్‌కు హాజరు కాకపోతే బీఎన్‌ఎస్‌ 35 (3), (4), (5), (6) సెక్షన్ల ప్రకారం అరెస్ట్‌ చేయాల్సి ఉంటుందన్నారు.

గోడకు నోటీసులు..
రాజ్‌ పాకాల ఇంట్లో లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించారు పోలీసులు. మరోవైపు పోలీసుల నోటీసు నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు రాజ్‌ పాకాల. పార్టీ వ్యవహారంలో తనను పోలీసులు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ప్రధానంగా ప్రస్తావించారు. తనను అరెస్ట్‌ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిష¯Œ లో కోరారు. మధ్యాహ్నం భోజనం తర్వాత ఈ పిటిషన్‌ పై విచారణ చేపట్టనుంది న్యాయస్థానం.

ANN TOP 10