AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బర్త్ డే కేక్ కటింగ్‌లో యువతికి ఫ్రెండ్స్ సర్‌ప్రైజ్.. కేక్‌లో ఏం పెట్టారంటే

పుట్టిన రోజు వేడుకల్లో స్నేహితుల సందడే ఎక్కువ. సరదాగా, సర్‌ప్రైజింగ్‌గా వేడుకలు నిర్వహిస్తుంటారు. థ్రిల్‌కు గురిచేసేలా ప్లాన్ చేస్తుంటారు. ఓ యువతికి ఆమె స్నేహితులు కూడా ఇలాంటి సర్‌ప్రైజే ఇచ్చారు. యువతి కేక్ కట్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే అందులో మొదట హ్యాపీ బర్త్ డే ట్యాగ్‌‌తో ఉన్న రూ.500 నోటు ఉందని గుర్తించి దానిని బయటకు తీసింది. ఆ నోటు అనంతరం ఒక దాని తర్వాత మరొకటి అలా మొత్తం 29 నోట్లు వచ్చాయి. కవర్‌లో చాలా జాగ్రత్తగా పెట్టిన ఈ నోట్లన్నీ కలిపి దండ రూపంలో అమర్చి ఉన్నాయి. దీంతో స్నేహితులంతా కలిసి నోట్ల దండను యువతిలో మెడలో వేసి బిగ్ సర్‌ఫ్రైజ్ ఇచ్చారు. ఈ నోట్ల విలువ రూ.14,500గా ఉంది. దీంతో ఆనందంతో నవ్వింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది.

కేక్ కటింగ్ కోసం ఎదురుచూసి అందులో డబ్బులు దండ ఉండడాన్ని గమనించి యువతి ఆశ్చర్యపోయింది. ఆ సమయంలో ఆమె ఇచ్చిన రియాక్షన్ వైరల్‌‌గా మారింది. ‘‘నిజంగా మీకు దేవుడి దీవెనలు ఉన్నాయి. డబ్బు బహుమతిగా ఇచ్చినందుకు కాదు. మీ స్నేహతుల ప్రేమ విషయంలో అదృష్టవంతులు’’ అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. ‘‘నా జీతం ఒకే కేకులో’’, ‘‘ఇది కేకా లేక ఏటీఎంమా’’ అంటూ పలువురు సరదా వ్యాఖ్యలు చేశారు. ‘‘ నాకు ఈ కేక్ కావాలి”, “దీపావళి బోనస్ ఇచ్చారు’’ అని మరికొందరు వ్యాఖ్యానించారు.

 

ANN TOP 10