AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బంగారు దుస్తుల్లో అనంత్, రాధిక.. సంగీత్‌ వేడుకల్లో స్పెషల్‌ అట్రాక్షన్‌

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ సంస్థల అధినేత ముఖేష్‌ అంబానీ చిన్న కొడుకు అనంత్‌ అంబానీ పెళ్లి జూలై 12న జరనున్న విషయం తెలిసిందే. అయితే అంతకు ముందు జరగాల్సిన వేడుకలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే ప్రతీ కార్యక్రమం ఎంతో ఆకట్టుకుంటోంది. దేశ, విదేశాలకు చెందిన సెలబ్రిటీలు, ప్రముఖులు, సినీ తారలు పాల్గొంటూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. శుక్రవారం రాత్రి ముంబైలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్లో జరిగిన అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ సంగీత్‌ ఉత్సవం అంబరాన్నంటగా.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమందిని ఆకట్టుకుంది. ఎందుకంటే ఇక్కడ వధూ వరుల డ్రెస్సింగ్‌ స్టైల్‌ మరింత స్పెషల్‌గా నిలిచింది. అనంత్‌ అంబానీ బంగారంతో తయారు చేసిన బ్లాక్‌ అండ్‌ గోల్డెన్‌ కలర్‌ బంద్‌ గాలా కోట్‌.. ప్యాంటు ధరించగా, రాధికా మర్చంట్‌ లైట్‌ బ్రౌన్‌ అండ్‌ గోల్డెన్‌ కలర్‌ కాంబినేషన్‌ గల స్వరోవ్‌ స్కీ క్రిస్టల్సో్త తయారు చేసిన ఆఫ్‌ షోల్డర్‌ బ్లౌజ్‌ అండ్‌ లెహంగాలో మెరిసిపోయింది.

ANN TOP 10