AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీ టన్నెల్ ప్రాజెక్ట్‌పై తెలంగాణ సర్కార్ ఎందుకు మౌనంగా ఉంది?: కవిత..

నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టన్నెల్ పనులు చేపట్టినా రేవంత్ ప్రభుత్వం మౌనంగా ఉందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత విమర్శించారు. పొరుగు రాష్ట్రం ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టు పనులు చేపడుతున్నా రేవంత్ ప్రభుత్వం ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని నిలదీశారు. 

నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీ నుండి అక్రమంగా నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం భారీ టన్నెల్ ప్రాజెక్ట్ చేపట్టినా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదు? అని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి అనుమతితోనే ఏపీ ప్రభుత్వం ఈ టన్నెల్ ప్రాజెక్టును చేపట్టిందా? అని నిలదీశారు. ఏపీ ప్రభుత్వం ఇంత భారీ ఎత్తున ప్రాజెక్టు పనులు చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వానికి కనీస సమాచారం లేదా? అంటూ మండిపడ్డారు.

ANN TOP 10