టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి పనులలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ బాబు (Mahesh Babu)పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అయింది. ఇలా ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో మహేష్ బాబు చిన్న విరామం తీసుకుని తదుపరి సినిమా పనులలో బిజీ కాబోతున్నారు. ఇక మహేష్ బాబు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు అయితే ఇప్పటివరకు ఈయన రాజమౌళి(Rajamouli) డైరెక్షన్ లో ఒక సినిమా కూడా లేదనే సంగతి తెలిసిందే. వారణాసి సినిమా మొదటి సినిమా కావటం విశేషం..
రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన RRR సినిమా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవడంతో ఈ సినిమా తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వారణాసి సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై గ్లోబల్ రేంజ్ లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాని 2027 ఏప్రిల్ ఏడో తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు చిత్ర నిర్మాతలు ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఇలా ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవని చిత్ర నిర్మాతలు వెల్లడించారు. ఇకపోతే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి.
ఇలా ఈ సినిమా విడుదల వాయిదా అంటూ వార్తలు వస్తున్నప్పటికీ చిత్ర నిర్మాతలు మాత్రం ఎక్కడ ఈ విషయంపై స్పందించలేదు అయితే ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం సమయం ఎక్కువగా తీసుకుంటున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితులలో వాయిదా వేయాల్సి వస్తుందని తెలుస్తోంది. ఉగాది పండుగ సందర్భంగా ఏప్రిల్ ఏడో తేదీ విడుదల కావాల్సిన వారణాసి సినిమా జులై 30వ తేదీ విడుదలకు సిద్ధం అవుతుందని సమాచారం. మహేష్ బాబు పుట్టినరోజుకు పది రోజులు ముందుగా ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
1300 కోట్ల బడ్జెట్ సినిమాగా వారణాసి..
ఈ సినిమా ఏప్రిల్ 7వ తేదీ వాయిదా పడినప్పటికీ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని విడుదల చేసే ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నారని తెలిసిన ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మహేష్ బాబు పుట్టినరోజుకు ఇంతకు మించిన ట్రీట్ ఉండదని ఫాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ సినిమా వాయిదా గురించి కొత్త విడుదల తేదీ గురించి మేకర్స్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన తెలియజేయలేదు. మరి ఈ వార్తలపై మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఎస్ఎస్ కార్తికేయ, కేల్ నారాయణ నిర్మిస్తున్నారు దాదాపు 1300 కోట్ల బడ్జెట్ త ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.








