AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లడఖ్‌లో ఘోర ప్రమాదం.. ఐదుగురు సైనికులు మృతి..

కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్యాంక్ ఎక్సర్‌సైజ్‌లో భాగంగా నది దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలో నది దాటుతున్న సమయంలో ట్యాంక్ ప్రమాదానికి గురై ఐదుగురు సైనికులు మరణించారు. T-72 ట్యాంక్‌లో మందిర్ మోర్హ్ నది దాటుతుండగా ఒక్కసారిగా ప్రవాహ ఉద్ధృతి పెరిగి ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. దౌలత్‌ బెగ్‌ ఓల్డీ ప్రాంతంలో భారత సైన్యం నిర్వహించిన విన్యాసాల్లో శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నదిని దాటే ట్యాంక్‌ విన్యాసాలు చేస్తుండగా.. ఒక్కసారిగా నీటి ఉద్ధృతి పెరిగింది. దీంతో ఐదుగురు జవాన్లు నదిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి ఉన్నట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.

ANN TOP 10