AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వందసార్లైనా జైలుకు వెళ్తా.. ఢిల్లీ సీఎం సంచలన వ్యాఖ్యలు

ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని రక్షించడం కోసం జైలుకు వెళ్లడం గర్వంగా ఉందని అన్నారు. అందుకు ఎన్నిసార్లైనా జైలుకు వెళ్తానని చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. గురువారం పంజాబ్‌ జలంధర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా మీడియాతో కేజ్రీవాల్‌ మాట్లాడారు. తాను భగత్‌సింగ్‌ అనుచరుడినని, దేశాన్ని రక్షించేందుకు వందసార్లు జైలుకెళ్లాల్సి వచ్చినా వెళ్తానని చెప్పారు.

ఈ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 200 కంటే తక్కువ సీట్లు వస్తాయని, ఇండియా కూటమికి 300 సీట్లకు ఎక్కువే వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. తాను అవినీతికి పాల్పడ్డానని బీజేపీ నేతలు అంటున్నారని, కానీ సాక్ష్యాలు చూపించలేకపోతున్నారని అన్నారు. తాను అవినీతి చేస్తే ప్రపంచంలో ఇక ఎవరూ నిజాయితీపరులు మిగలరని అన్నారు. లిక్కర్ స్కాంలో రూ.100 కోట్లు దోచుకున్నారని అంటున్నారని, దాదాపు 500 ప్రాంతాల్లో దాడులు చేశారని అన్నారు. కానీ ఒక్కపైసా అయినా స్వాధీనం చేసుకున్నారా అంటూ ప్రశ్నించారు. వంద కోట్ల రూపాయలు లంచం తీసుకొని ఉంటే.. తనిఖీల్లో బయటపడాలి కదా అని అడిగారు. ఆ వంద కోట్లు గాల్లో మాయమైపోయాయా అంటూ వ్యాఖ్యానించారు. తాను జూన్ 2 తిరిగి జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పంజాబ్‌లో ప్రభుత్వాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటున్నారని, అలాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్పుతారని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.

ANN TOP 10