AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పాలు విరిగాయని పైపుతో భార్యను చితకబాదిన భర్త

పాలు విరిగిపోయినందుకు కోపంతో ఊగిపోయిన భర్త పైపుతో భార్యను చితకబాదాడు. అతడికి తల్లి, సోదరి కూడా తోడయ్యారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. సనత్‌నగర్‌ అల్లాఉద్దీన్‌కోఠికి చెందిన హీనాబేగం (28)కి ఎల్లారెడ్డిగూడకు చెందిన హుస్సేన్ (42)తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

పెళ్లి సమయంలో కట్నం తీసుకున్నప్పటికీ అదనపు కట్నం కావాలంటూ హీనాబేగంను భర్త, అత్త అఫ్రోజ్ బేగం, ఆడపడుచు సోని, మరిదిలు తబ్రేజ్, అయూబ్‌ నిత్యం శారీరకంగా, మానసికంగా వేధించసాగారు. ఈ క్రమంలో తాజాగా హీనాబేగం పాలు మరగబెడుతున్న సమయంలో అవి విరిగిపోయాయి. దీనిని సాకుగా తీసుకుని అందరూ కలిసి అకారణంగా పాలు విరగ్గొట్టావని మండిపడుతూ పైపుతో ఆమెపై దాడిచేశారు. దీంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది.

ఆ వెంటనే అత్తమామలకు ఫోన్ చేసిన హుస్సేన్.. హీనా చనిపోయిందని, వెంటనే రావాలని చెప్పాడు. వారొచ్చి తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న కుమార్తెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ANN TOP 10