AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కూలీలకు దొరికిన గుప్త నిధి.. సిద్దిపేట జిల్లాలో అద్భుతం

‘ఉపాధి’ పనులు చేస్తుండగా లభ్యం
బాక్స్‌లో 25 వెండి నాణేలు, రెండు ఉంగరాలు

(అమ్మన్యూస్, సిద్దిపేట):
సిద్దిపేట జిల్లాలో అద్భుతం చోటుచేసుకుంది. మద్దూరు మండలం నర్సాయపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు వెండి నాణేల బాక్స్‌ కనిపించింది. గ్రామంలో చల్ల మల్లారెడ్డి అనే రైతు వ్యవసాయ భావి వద్ద ఉపాధి హామీ కూలీలు పనిచేస్తుండగా రాయితో చేసిన బాక్స్‌ కనిపించింది. మొదట వారంతా దానిని తెరిచేందుకు భయపడ్డారు. ఎలాగోలా తెరచి చూడగా.. అందులో 25 వెండి నాణేలు ఉన్నాయి. అదేవిధంగా వెండితో చేసిన రెండు ఉంగారాల కూడా లభ్యమయ్యాయి. ఈ విషయంలో అందరి నోట్లో పడటంతో ఊరుఊరంతా ఆ నాణేలను చూసేందుకు ఎగబడ్డారు. అందుకు సంబంధించిన వీడియోలు కొందరు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. ప్రస్తుతం అవి విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి.

ANN TOP 10