AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేంద్ర హోంశాఖకు బాంబు బెదిరింపు

కేంద్ర హోం శాఖకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. బుధవారం న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. మెయిల్ రావడంతో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తం అయ్యారు. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం వెంటనే నార్త్‌ బ్లాక్‌లోని రెడ్‌ స్టోన్‌ బిల్డింగ్‌ వద్దకు చేరుకొని సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించారు. బాంబ్‌ స్వ్కాడ్‌, జాగిలాల సాయంతో బిల్డింగ్‌ మొత్తం తనిఖీలు చేశారు. అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులూ, పేలుడు పదార్థాలు దొరకలేదు. ఈ మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ మెయిల్‌ ఆధారంగా బెదిరింపులకు పాల్పడిన వారిని పట్టుకునే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు.

ANN TOP 10