గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ వస్తుందని ఫైర్ అయ్యారు. రాజీవ్ గాంధీ 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారని గుర్తు చేశారు. ప్రతిపక్షాల మీద విచ్చలవిడిగా కేసులు పెట్టారని అన్నారు. బీహార్, వెస్ట్ బెంగాల్‌లో మాదిరి తెలంగాణలో ఓట్ల తొలగింపు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో 3 కోట్ల 38 లక్షల ఓట్లు ఉంటే 73 లక్షల పైగా ఓట్లు తొలగించారని అన్నారు. బీద ప్రజల ఓట్లను తొలగించారు. 2002 కండిషన్ పెట్టడం వల్ల ఎన్యూమరేషన్ ఫాం ఇవ్వలేని పరిస్థితి ఉందని పేర్కోన్నారు. ఆన్ మ్యాపింగ్ 32 లక్షల 37 వేల ఓట్లు, 60 లక్షల పైగా ఓట్లు డౌట్ ఫుల్ గా ఉన్నాయని పేర్కోన్నారు. Bla లు 35 వేల ఓట్లకు రిసిపిట్ ఇచ్చారు. 13 వేల 100 మంది అని ఎలక్షన్ కమిషన్ చూపిస్తోందని తెలిపారు. 2002 వివరాలను కాకుండా వివరాలు సరిగ్గా ఉంటే ఓటు హక్కు కల్పించాలని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
కోటి 60 లక్షల ఓటర్లు ఎందుకు క్వచన్ మార్క్ చేసారని ఫైర్ అయ్యారు. ప్రతి పౌరుడు ఓటు కాపాడాలని కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని, సర్ కి ఇంకా సమయం ఇవ్వాల్సి ఉంది. గడువు పొడిగించాలని డిమాండ్ చేశారు. రాష్టంలో 92 లక్షల ఓట్లు ప్రశ్నార్థకంగా ఉన్నాయని, అర్హత కలిగిన ఓటును కాపాడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. Bla లిస్ట్ ఇచ్చిన తర్వాతా ఎలా తప్పు చూపిస్తారని, ఈసీ ఉదాసీనంగా వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు. ఓట్ల తొలగించే కండిషన్ పెట్టారని, ఎలక్షన్ కమిషన్ ను డిమాండ్ చేస్తున్నాం.కోటి 60 లక్షల ఓటర్లను క్వచన్ మార్క్‌లో పెట్టారో వివరాలు ఇవ్వాలి ఎలక్షన్ కమిషన్ ను డిమాండ్ చేసారు.








