AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇరుముడి “మల్లెపూల పల్లకి” సాంగ్ లో రామ్ చరణ్.!.

మాస్ మహారాజా రవితేజ (Raviteja) హిట్ , ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. గత ఏడాది చివరిలో ‘మాస్ జాతర’, ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ.. ఇప్పుడు ఏకంగా జానర్ మార్చి ‘ఇరుముడి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ జానర్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఇకపోతే విడుదల దగ్గర పడుతున్న సమయంలో సోషల్ మీడియాలో ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది.ఇరుముడి సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఒక క్రేజీ స్పెషల్ లో కనిపించబోతున్నారనే వార్త వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఫోక్ సాంగ్ “మల్లెపూల పల్లకి” పాటలో రామ్ చరణ్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని , ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది అంటూ ఊహాగానాలు షికారులు చేస్తున్నాయి. దీంతో మెగా అభిమానులు, మాస్ మహారాజా రవితేజ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

నిజానికీ రామ్ చరణ్ అయ్యప్ప మాలలో సంవత్సరానికి 3 నుండి 4 సార్లు కనిపిస్తారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అయ్యప్ప అంటే ఆయనకు ఎంతో భక్తి.. అలాంటి అయ్యప్ప స్వామి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు అంటూ వార్తలు రాగా.. తాజాగా ఈ వార్తలపై రామ్ చరణ్ టీం స్పందించింది. ఇరుముడి సినిమాలో మల్లెపూల పల్లకి పాటలో రామ్ చరణ్ పాత్ర పోషిస్తున్నారు. అంటూ వస్తున్న వార్తలన్నీ రూమర్స్.. దయచేసి అసత్యాలను ప్రచారం చేయొద్దు అంటూ విజ్ఞప్తి చేసింది.

ఇరుముడి చిత్రం ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్లో అయ్యప్ప పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ.. సినిమాలో ఈ పాటలో అదిరిపోయే సర్ప్రైజ్ ఉంటుందని తెలిపారు. దాంతో రామ్ చరణ్ ఈ పాటలో కనిపిస్తారనే ప్రచారం జోరుగా మొదలైంది ఇక ఎట్టకేలకు ఈ ప్రచారానికి రవితేజ టీం స్పందించి చెక్ పెట్టింది.

అయ్యప్ప దీక్ష తీసుకున్న 41 రోజుల్లో కథానాయకుడు జీవితంలో చోటు చేసుకునే పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వ్యసనాలు ఉన్న ఒక వ్యక్తి ఈ దీక్ష తీసుకోవాల్సి వస్తే అతడు మద్యానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అక్కడే కథలో అసలైన సంఘర్షణ మొదలవుతుంది అని డైరెక్టర్ ఇటీవల కథ గురించి చెప్పారు. శివా నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్ (Priya Bhavani Shankar) హీరోయిన్ గా నటించింది.

ANN TOP 10