ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈవీఎం ధ్వంసం చేసిన నేపథ్యంలో ఆయన మెడకు ఉచ్చుబిగుస్తోంది. పాల్వయి గ్రామంలో పోలింగ్ బూత్‌లో ఈవీఎం ధ్వంసం చేయడాన్ని సీరియస్‌గా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. దీంతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం సీఈవో ముకేష్ కుమార్ మీనాకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎం ద్వంసం ఘటనపై సాయంత్రం 5లోగా నివేదిక ఇవ్వాలని కోరింది. ఇప్పటివరకూ పిన్నెల్లిని ఎందుకు అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈవీఎం ధ్వంసం చేసిన విషయంలో ఈసీ చాలా తీవ్రంగా పరిగణిచింది. ఏ 1గా కోర్టులో మెమో కూడా ఫైలైందన్నారు. ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి తెలియజేయాలని సీఈవో ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే బృందాలుగా వీడి పోయి పోలీసులు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి కోసం గాలిస్తున్నారు.
తీవ్రమైన 10 సెక్షన్ల కింద మెమో ఫైల్ చేశాం: సీఈవో ఎంకే మీనా
కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసులపై ఏపీ సీఈవో ఎంకే మీనా స్పందించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ రోజు మాచర్లలో ఏడు ఘటనలు జరిగాయని చెప్పారు. ఈవీఎంలు ధ్వంసం చేశారని, ఘటలన్నీ వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించామని తెలిపారు. వెంటనే అరెస్టు చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసిందిజ ఈవీఎం ధ్వంసం చేసిన డేటా భద్రంగా ఉందని చెప్పారు. ఈవీఎం ధ్వంసంపై తీవ్రమైన 10 సెక్షన్ల కింద మెమో ఫైల్ చేశామన్నారు. డేటా భద్రంగా ఉండడం వల్లే కొత్త ఈవీఎంతో పోలింగ్ కొనసాగించామని పేర్కొన్నారు. ఈ ఘటనపై తర్వాత విచారణ ప్రారంభించామన్నారు. సిట్‌కు పోలీసులు అన్ని వివరాలు అందించారన్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయని, ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. నిన్నటి నుంచే ఆయనను అరెస్టు చేసేందుకు ప్రయత్నిసున్నామని సీఈవో ఎంకే మీనా వెల్లడించారు.









