AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అధికారంలోకి రాగానే అగ్నివీర్‌ రద్దు చేస్తాం: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని అన్నారు. బుధవారం హర్యానాలోని మ‌హేంద్రఘ‌ఢ్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. లోక్‌స‌భ ఎన్నిక‌ల అనంత‌రం తాము అధికారంలోకి రాగానే ఈ ప‌ధ‌కాన్ని ర‌ద్దు చేస్తామ‌ని పున‌రుద్ఘాటించారు. ప్రధాని మోడీ భార‌త సైనికుల‌ను కూలీలుగా మార్చార‌ని అన్నారు. అగ్నివీర్ స్కీమ్‌ను సైన్యం కోరుకోవ‌డం లేద‌ని, ఈ ప‌ధ‌కాన్ని ప్రధాని కార్యాల‌యం రూపొందించింద‌ని వ్యా్ఖ్యానించారు. తాము అధికారంలోకి వ‌స్తే ఈ ప‌ధ‌కాన్ని చెత్తబుట్టలో ప‌డేస్తామ‌ని చెప్పారు. హ‌ర్యానా రైతులు పొలాల్లో క‌ష్టప‌డుతున్నార‌ని, కానీ మోడీ ప్రభుత్వం బిలియ‌నీర్లకు సాయం చేసేలా ల్యాండ్ ట్రిబ్యున‌ల్ బిల్‌ను ర‌ద్దుచేసి రైతుల హ‌క్కుల‌ను కాల‌రాసింద‌ని ఆరోపించారు. మూడు వ్యవ‌సాయ బిల్లుల‌ను తీసుకువ‌చ్చింద‌ని, దీనిపై భార‌త్ జోడో యాత్రలో రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మీడియాలో ఎక్కడా క‌నిపించ‌లేద‌ని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గుర్తు చేశారు.

ANN TOP 10