ఇండియా కూటమిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గురిపించారు. విపక్ష ఇండియా కూటమికి క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన వ్యాధులున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని స్రవస్ధిలో బుధవారం జరిగిన ర్యాలీ పాల్లొని మాట్లాడారు. విపక్ష ఇండియా కూటమికి మతతత్వం, తీవ్ర జాతి వివక్ష, బంధుప్రీతి వంటి వ్యాధులున్నాయని వ్యాఖ్యానించారు. క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన ఈ వ్యాధులు వ్యాప్తి చెందితే దేశమంతటా వ్యాప్తి చెంది నాశనం చేస్తాయని అన్నారు.
దేశ వ్యాప్తంగా 4 కోట్ల మంది పేదలకు ఇండ్లు ఇచ్చారని, ఇప్పుడు ఎస్పీ-కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్నింటినీ తారుమారు చేస్తారని అన్నారు. విపక్షాలు గెలిస్తే పేదలకు తాము నిర్మించిన ఇండ్లను గుంజుకుని వాటిని తమ ఓటు బ్యాంక్‌కు పంచేస్తాయని ఆరోపించారు. బీజేపీ హాయాంలో ప్రారంభించిన 50 కోట్లకు పైగా జన్‌ధన్ ఖాతాలను మూసివేసి ఆ డబ్బును వారు లాగేసుకుంటారని చెప్పారు. ప్రతి గామానికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తే విపక్షాలు విద్యుత్ కనెక్షన్లను కట్ చేసి మళ్లీ చీకటిలో ముంచుతారని కామెంట్స్ చేశారు. యూపీలో అదే పాత ప్లాఫ్ సినిమాతో అదే పాత క్యారెక్టర్లు, పాత డైలాగ్‌లతో ఇద్దరు వారసత్వ నేతలు బయలుదేరారని ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.









