పోలింగ్ కేంద్రంలో విధ్వంసంపై ఆగ్రహం
ఎమ్మెల్యే అరెస్టుకు రంగం సిద్ధం..
హైదరాబాద్‌కు చేరుకున్న ప్రత్యేక పోలీసు బృందం
సంగారెడ్డి శివారులో కారు డ్రైవర్ అరెస్టు
(అమ్మన్యూస్, అమరావతి):
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా సోదరులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేయడంపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లోక్‌సభ ఎన్నికల వేళ ఏపీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో అధికార ఎమ్మెల్యేలు బలవంతంగా పోలింగ్ బూత్ లో దూరి రచ్చ చేశారు. ఈ క్రమంలోనే మాచర్ల లో ఎమ్మెల్యే పిన్నెల్లి పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎం మిషన్ ను పగలగొట్టాడు. ఈ ఘటనకు సంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది.
కేసు నమోదు చేయాలని ఆదేశం..
రాష్ట్ర ఎన్నికల అధికారికి నోటీసులు పంపింది. ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనపై వెంటనే వివరణ ఇవ్వాలని. అలాగే ఈ ఘటనపై ఎమ్మెల్యే పిన్నెల్లి పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అలాగే ఈ ఘటనపై సాయంత్రం ఐదు గంటల లోపు నివేదిక ఇవ్వాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం మిషన్ ధ్వంసం చేస్తున్న లైవ్ వీడియో ను అధికారులు మీడియాకు ఇచ్చారు. ఇది వైరల్ అవుతోంది. మరోవైపు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీస్ బృందం హైదరాబాద్ చేరుకుంది. ఇదిలాఉంటే.. ఈవీఎం ధ్వంసం చేసిన సంఘటనపై రెండు సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉండటంతో పోలీస్ వర్గాలు సతమతం అవుతున్నాయి. అదనపు సెక్షన్లు కూడా పెట్టేందుకు కోర్టులో మెమో వేయాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కారు డ్రైవర్ అరెస్టు..
ఈవీఎం ధ్వంసం ఘటనపై ఈ సాయంత్రం 5 లోగా నివేదికను ఈసీ కోరింది. ఈ మేరకు ఏపీ సీఈవో ముకేష్ కుమార్ మీనాకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏపీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలింపు చేపటారు. పిన్నెల్లి సంగారెడి వైపు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సంగారెడ్డి జిలా కంది వద్ద పిన్సెల్లి కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పిన్నెల్లి కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.









