AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

| తెగిపోయిన ఏసీ బోగీల లింక్‌.. మూడు గంటలు ఆలస్యంగా జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌

విశాఖపట్నం నుంచి లింగంపల్లికి బయల్దేరిన జన్మభూమి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (Janmabhoomi Express) సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. ఉదయం 6.20 గంటలకు విశాఖ నుంచి బయల్దేరిన 2 నిమిషాలకే ఏసీ బోగీ లింక్‌ తెగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. రైలను విశాఖ స్టేషన్‌కు తీసుకువచ్చారు. సాంకేతిక సమస్యతో 2 బోగీలు రైలు నుంచి విడిపోయాయని అధికారులు తెలిపారు. బోగీల లింక్‌ను సరిచేసిన అనంతరం 9.30 గంటలకు రైలు అక్కడి నుంచి బయల్దేరింది. ప్రస్తుతం జన్మభూమి రైలు 3 గంటలు ఆలస్యంగా నడుస్తున్నది.

కాగా, జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ ప్రతి రోజూ ఉదయం 6.15 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరుతుంది. రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్లగొండ మీదుగా లింగంపల్లికి రాత్రి 7.40 గంటలకు చేరుకుంటుంది.

ANN TOP 10