AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీ ప్రభుత్వంతో సఖ్యత కొనసాగిస్తాం.. తిరుమలలో రేవంత్‌ రెడ్డి

తిరుమల కొండపై కల్యాణమండపం, వసతి గృహం నిర్మిస్తాం
దీనిపై కొత్త ముఖ్యమంత్రితో చర్చిస్తాం..

(అమ్మన్యూస్, తిరుమల):
ఏపీలో ఏర్పడే నూతన ప్రభుత్వ సహకారంతో ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి సాధించేలా తన వంతు కృషి చేస్తానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.

దర్శనం అనంతరం ఆలయం వెలుపల రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉభయ రాష్ట్రాల్లో సమస్యల పరిష్కారానికి ఏపీలో ఏర్పడే నూతన ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. అలాగే తిరుమలలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కల్యాణ మండపం, వసతి గృహం ఏర్పాటుకు, నూతన ప్రభుత్వ సహకారం తీసుకుంటామన్నారు.

ANN TOP 10