AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తిరుమల శ్రీవారి సేవలో సీఎం రేవంత్‌

మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించిన సీఎం
తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష

(అమ్మన్యూస్, తిరుమల):
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సీఎం రేవంత్‌ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ వద్ద టీటీడీ అధికారి హరీంద్రనాథ్‌ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

రేవంత్‌ రెడ్డి ఉదయం శ్రీవారికి తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం ఉదయం 8.30 గంటలకు వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో రేవంత్‌ కుటుంబానికి ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్ధప్రసాదాలు అందేశారు.

దర్శనం అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్ర రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో నీటి సమస్యలు తీరి సకాలంలో వర్షాలు కురిశాయన్నారు. ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని ముఖ్యమంత్రి కాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. స్వామి వారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నారు.

ANN TOP 10