AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇంటి నేమ్‌ప్లేట్‌ మార్చేసిన సానియా మీర్జా.. ఎవరి పేరు యాడ్‌ చేసిందంటే..?

భారత టెన్నిస్‌ స్టార్‌ (Tennis Star) సానియా మీర్జా ఇటీవలే భర్త నుంచి విడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కుమారుడితో కలిసి ఒంటరిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో తన పాత జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా చెరుపేసుకుంటూ లైఫ్‌ను కొత్తగా మొదలెట్టింది. ఇందులో భాగంగానే తాజాగా తన ఇంటి నేమ్‌ ప్లేట్‌ను కూడా మార్చేసింది. తన పేరు పక్కన కుమారుడు ఇజాన్‌ పేరు ఉండేలా ‘సానియా ఇజాన్‌’ (Sania and Izhaan) అంటూ నేమ్‌ ప్లేట్‌ను తయారు చేయించుకుని ఇంటి ముందు తగిలించేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోను సానియా తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది.

కాగా, దాయాదిదేశమైన పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను సానియా మీర్జా ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం 2010లో హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. 2018లో ఈ దంపతులకు ఓ కుమారుడు (ఇజాన్) జన్మించాడు. అయితే, ఇటీవలే వీరు తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. ఆ తర్వాత షోయబ్‌ ముచ్చటగా మూడో పెళ్లి కూడా చేసుకున్నాడు. పాకిస్థాన్‌ ప్రముఖ సినీతారగా గుర్తింపు పొందిన సనా జావెద్‌ను ఈ ఏడాది జనవరిలో వివాహం చేసుకొని అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇక సానియా మాత్రం కుమారుడితో ఒంటరిగానే ఉంటోంది.

ANN TOP 10