AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేదార్‌నాథ్‌కు పోటెత్తుతున్న భక్తులు.. పది రోజుల్లోనే 2.81లక్షల మంది దర్శనం

చార్‌ధామ్‌ యాత్రలోని కేదార్‌నాథ్‌ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ ఏడాది మే 10న కేదార్‌నాథ్‌ ధామ్‌ తెర్చుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి కేవలం పది రోజుల్లో 2.81లక్షల మంది భక్తులు బాబా కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నారు. అయితే, కేదార్‌నాథ్‌కు ఏటా వస్తున్న భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. 2017లో 4.71లక్షల మంది తరలివచ్చారు. 2018లో 9లక్షల మంది, 2019లో పది లక్షల మందికిపైగా భక్తులు బాబా కేదార్‌నాథ్‌ దర్శనం కోసం వచ్చారు.

2020-2021 సంవత్సరంలో కరోనా కాలంలో చివరి నెలల్లో యాత్ర కొత్త విజయాలు సాధించింది. కాగా, 2022లో 15.63 లక్షలు, 2023లో 19 లక్షలకుపైగా దర్శించుకున్నారు. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ధామ్‌లో సౌకర్యాల కల్పనతో యాత్ర కొనసాగుతున్నది. కేదార్‌నాథ్ ధామ్‌లో గత తొమ్మిది సంవత్సరాలుగా పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

ANN TOP 10