ప్రతి ఒక్కరు బాధ్యతగా ఓటు వేయాలని మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తెలిపారు. ఆయన పూడూర్ లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం పవిత్ర ఘట్టంగా అభివర్ణించారు. ఎన్నికల్లో నోట్లు, మద్యంతో ప్రలోభపెట్టడం మంచి కాదన్నారు. మల్కాజిగిరి లో ఎంపీగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.









