AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఓటు హక్కు వినియోగించుకున్న జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌‌ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4 కోట్ల 14 లక్షల మందికిపైగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 169 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. అరకు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న కురుపాం, సాలూరు, పాలకొండల్లో ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఇటు పాడేరు, అరకు వ్యాలీ, రంపచోడవరాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు.

⍟ పులివెందులలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం వైఎస్‌ జగన్‌
⍟ కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల బాకరాపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న జగన్‌
⍟ 138వ నెంబర్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేసిన సీఎం వైఎస్ జగన్‌


ఓటు హక్కు వినియోగించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబం
⍟ గుంటూరు జిల్లా ఉండవల్లిలోని పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన చంద్రబాబు ఫ్యామిలీ
⍟ ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, నారా భువనేశ్వరి, నారా లోకేశ్‌, బ్రాహ్మణి
⍟ ఓటు వేసేందుకు జనం చూపిస్తున్న చొరవ మరిచిపోలేనిది: చంద్రబాబు
⍟ ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలి:చంద్రబాబు
⍟ ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి :చంద్రబాబు
⍟ భవిష్యత్తును తీర్చిదిద్దేది ఎన్నికలే అని ప్రజలు గుర్తించారు:చంద్రబాబు

ఓటు వేసిన నారా లోకేష్ దంపతులు

మంగళగిరలో ఓటేసిన పవన్ కళ్యాణ్
⍟ ఓటు హక్కు వినియోగించుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దంపతులు
⍟ మంగళగిరిలో సతీసమేతంగా వచ్చిన పవన్ కళ్యాణ్

రాజమహేంద్రవరంలో ఓటు వేసిన పురందేశ్వరి
⍟ ఓటు హక్కు వినియోగించుకున్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం లోక్‌సభ అభ్యర్థి పురందేశ్వరి
⍟ రాజమహేంద్రవరంలోని వీఎల్‌ పురంలో ఓటు వేసిన పురందేశ్వరి
ఓటు వేసిన పురందేశ్వరి

విజయవాడలో ఓటు హక్కు వినియోగించుకున్న గవర్నర్ దంపతులు
⍟ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఓటు వేసిన ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ దంపతులు
⍟ రైల్వే కళ్యాణ మండపంలోని 155 పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన గవర్నర్‌ దంపతులు
ఏపీ గవర్నర్ ఓటు

ANN TOP 10